“మీ బతుకుల నిండా అబద్ధాలు. తప్పుడు ప్రచారాలే. ఈసారికూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పుతో టిడిపి కి శాశ్వతంగా సమాధికట్టబోతున్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జీతాలు, అలవెన్సులు రూపంలో సలహాదారులకు, వారి సిబ్బందికి, ఇంటి అద్దెరూపంలో, కారు సౌకర్యం రూపంలో మొత్తంగా చెల్లించింది కేవలం రూ.48.33కోట్లు. ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన సిబ్బందికి, కారు, ఇంటి అద్దె అలవెన్స్ రూపంలో చెల్లించింది కేవలం రూ.165లక్షలు. మరి ఈ రూ.140 కోట్లు లెక్క ఎక్కడిది? రోజురోజుకి పచ్చి అబద్ధాలు చెప్తూ సిగ్గూ, శరంలేకుండా ప్రవర్తిస్తుంది టీడీపీ! అని YSRCP తీవ్రంగా ఖండించింది.