బీజేపీకి రాష్ట్రంలోని మూడు పార్టీలు బానిసలుగా మారాయి. B అంటే బాబు J అంటే జగన్, P అంటే పవన్.బీజేపీ బిల్లు పెడితే ఒక్క మాట ఎదురు మాట్లాడకుండా ఓటు వేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. హామీలు ఇచ్చి మోసం చేయడం YSR పాలన కాదు. అభివృద్ధి పూర్తిగా మరిచారు. ఇది గుంటూరు, కానీ గుంటలూరుగా మార్చారు.గుంటలూరు గుంటూరు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి.దేశంలో రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే పోలవరం పూర్తి అవుతుంది.కాంగ్రెస్ కి ఓటు వేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. – ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల