విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదాలతో దద్దరిల్లిన విశాఖ. విశాఖ ఉక్కు కర్మాగారం నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలపడం జరిగింది.నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. లాభాల్లో ఉన్న ప్రాజెక్టను అమ్ముతున్నారంటే సిగ్గు పడాలి. కష్టం వస్తే ప్రజలు ప్రభుత్వానికి చెప్పుకుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ. ఇక్కడ ఉన్న జింక్ ఫ్యాక్టరీ నీ వేదాంతాకి ఇచ్చారు అది కాస్తా రియల్ ఎస్టేట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కానివ్వం.స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు ఆంధ్రాకే తలమానికం.స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీ గారిని తీసుకువచ్చి హామీ ఇప్పిస్తా..ప్లాంట్ కి కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నా. ఉద్యోగాలు రాని 8 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేలా పోరాటం చేస్తాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా చేర్చ బోతోంది.
ఏపీపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల 24.01.2024