*భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని అస్సాంలో అడ్డుకోవడంపై విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపటం జరిగింది. బీజేపీ గూండాలు గుంపులుగా వచ్చి రాహుల్ గాంధీ గారి యాత్రపై దాడి చేసి ఆయనకు ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేశారు. శాంతియూత యాత్రను బీజేపీ అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ దేశం అందరిదీ కాదా..? కేవలం బీజేపీ,RSS కార్యకర్తలే ఉండాలా..? మిగతా ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరా ? రాహుల్ గాంధీ గారిని కనీసం గుడికి కూడా వెళ్లనీయలేదు. అయోధ్యలో రామ మందిరానికి అస్సాంలో రాహుల్ గాంధీ గారిని గుడిలోకి వెళ్ళనీయక పోవడానికి సంబంధం ఏంటి..?రాహుల్ గాంధీ గారికి ఎందుకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదో చెప్పాలి..? ఇలాంటి చర్యలతో మోడీ పాలన ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోవాలి..? మోడీ నిరంకుశ పాలన ఆగాలి.. ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు* ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల