1)బోగస్ ఓట్లకు మరో ఇద్దరిపై “వేటు”
2)కంప్యూటర్ ఆపరేటర్ ఔట్సోర్సింగ్ సిబ్బందిపై 3 పై ఎఫ్ ఐ ఆర్ నమోదు!
3)ఓటర్ల ముసాయిదా డ్రాఫ్ట్ విడుదల గడువును మరో 15 రోజులు పాటు పెంచాలి లేనిపక్షంలో కోర్టుని ఆశ్రయిస్తాను..
4) సెంటర్ ఎలక్షన్ కమిషన్ దర్యాప్తులో 34 వేల భొగస్ ఓటర్ కార్డులు గుర్తించి అధికారులను సస్పెండ్ చేస్తున్న సందర్భంగా అప్పటినుంచి జరిగిన అన్నీ ఎన్నికలను “నగరపాలక సంస్థ”తో సహా రద్దు చేసి గెలిచిన అభ్యర్థులను డిస్క్వాలిఫై (disqualified) చేయాలని నవీన్ డిమాండ్!
బోగస్ ఓట్ల,ఓటర్ కార్డుల తయారీలో రాజకీయ పార్టీ నాయకులను,పెద్ద స్థాయి అధికారులను (తిమింగలాలను) వదిలి పెట్టి చిరు ఉద్యోగస్తులపై(చిన్న చేపల)పై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు!
తిరుపతి బోగస్ ఓట్ల కు సహకరించిన అధికారులపై ఔట్సోర్సింగ్ సిబ్బందిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొరడా జులిపించడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సస్పెన్షన్ల పరంపర ప్రారంభమై కొనసాగుతుందన్నారు!
తిరుపతి జిల్లాకు సంబంధించి తయారు చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాను ముందుగా ప్రకటించిన విధంగా 22 వ తేదీన కాకుండా మరో 15 రోజులపాటు అధికారులకు గడువు ఇచ్చి అధికారిక లెక్కల ప్రకారం గతంలో తయారుచేసిన 34 వేల బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించిన తర్వాత జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయాలని లేనిపక్షంలో కోర్టు ను ఆశ్రయిస్తానని నవీన్ హెచ్చరించారు!
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్,చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏపీ ఆదేశాల ప్రకారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మంగళగిరి కార్యాలయం నుంచి “మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు” వేసిందన్నారు!
CCLA ఆదేశాల ప్రకారం…
1) ఎం జయరాములు ఏ ఈ ఆర్ ఓ & తాసిల్దార్, తిరుపతి అర్బన్ (ప్రస్తుతం తిరుపతి కలెక్టరేట్లో ఏవో గా పని చేస్తున్నారు)
2) ఎం విజయ భాస్కర్ ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్, తిరుపతి అర్బన్ మండల్ (ప్రస్తుతం DT పుత్తూరు లో పనిచేస్తున్నారు) ఈ నెల చివరన పదవీ విరమణ చేయబోతున్నారనీ,
రాజకీయం పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ “ఉద్యోగస్తులు బలి పశువులవుతున్నారన్నారు”!
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ 7-1-2024 అంటే పది రోజుల క్రితం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో FIR No:15/2024 కేసు పెట్టడం 2021 లో కంప్యూటర్ ఆపరేటర్లు A) ప్రతాప్ నాయక్ B) శివకుమార్ C) విజయకుమార్ లు EPIC (ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు) బోగస్ కార్డుల తయారీ చేయలేదని చెబుతున్నారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (IT) సంబంధించిన విషయం కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ (ఫోరెన్సిక్ విభాగం) చేపట్టాలని అలస్యంగా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టడం పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు!
తిరుపతి నగరపాలక సంస్థలో, రెవెన్యూ శాఖలో చిన్న చేపలను పట్టడం మాని బోగస్ ఓటర్ కార్డు ఎక్కడ తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? బోగస్ ఓట్ల పథకం నడిపించిన తిమింగలాల భరతం పట్టాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ను నవీన్ డిమాండ్ చేశారు!
నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్