బోగస్ ఓట్లు
@
బోగస్ అధికారుల భరతం పట్టండి!
బోగస్ ఓటర్ కార్డుల తయారీకి సహకరించిన ఏ రాజకీయ పార్టీల నాయకులనైనా 10 సం” ల పాటు ఏ ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలు లేకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ “అనర్హత వేటు” వేయాలన్నారు!
“బోగస్ ఓట్లకు కేరాఫ్ అడ్రస్” గా తిరుపతి పుణ్యక్షేత్రం మారడం శోచనీయం!
“కంచే చేను మేసిన” చందంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి ఉన్నతాధికారులే ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేయడం అన్యాయం అన్నారు!
తిరుపతి నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ గిరీషా తో పాటు పనిచేసిన కిందిస్థాయి అధికారులతో సహా తిరుపతి రెవెన్యూ అధికారుల ఓటర్ల జాబితా పనితీరుపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(CEC) విచారణకు ఆదేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా జరగలేని “నమ్మలేని నిజాలు” వెలుగులోకి వస్తాయన్నారు!
1) తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం కేంద్రంగా సుమారు 30 వేల “బోగస్ ఓటర్ కార్డులు” ఎక్కడ తయారు చేశారు?
2) ఎంతమంది అధికారుల సహకారంతో తయారు చేశారు?
3) ఎవరు తయారు చేశారు?
అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేపడితే “ఇంటి దొంగల గుట్టు” రట్టు అవుతుందని ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందన్నారు!
తిరుపతి జిల్లా స్థాయి అధికారులతో సహా నగరపాలక సంస్థ,రెవిన్యూ శాఖ పరిధిలో గత 5 సంవత్సరాలుగా పనిచేసిన అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయకుండా విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ ను నవీన్ డిమాండ్ చేశారు!
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, యువత ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఉపన్యాసాలు ఇస్తూ అవగాహన ర్యాలీలు జరిపే జిల్లా అధికార యంత్రాంగమే బోగస్ ఓట్లను,బోగస్ ఓటర్ కార్డులను తయారు చేయడం దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసి ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లిన అన్ని స్థాయిలలోని అధికారులను సైతం విచారణ జరపాలన్నారు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం భోగస్ ఓట్లకు,భూ కబ్జాలకు,అవినీతి అక్రమాలకు,మత్తు పదార్థాలకు “కేరాఫ్ అడ్రస్” గా మారడం దురదృష్టకరమన్నారు!
తిరుపతి నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ ఓటర్ల నమోదు లాగిన్ పాస్వర్డ్ key ఎవరి ఒత్తిడితో ఏ రాజకీయ నాయకులకు ఇచ్చారు, బోగస్ ఓటర్ల నమోదులో ఎంతమంది అధికారులు భాగస్వాములయ్యారు అన్న వాస్తవాలపై “సెంట్రల్ ఎలక్షన్ కమిషన్” దృష్టి సారించి తిరుపతిలో చేర్చిన బోగస్ ఓట్ల, అధికారుల భరతం పట్టాలని సంబందిత అధికారులను సస్పెండ్ చేయాలని నవీన్ డిమాండ్ చేశారు
దేశంలో,రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ పోతూ ఉంటాయని రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారి మాటలకు తలోగ్గి ఉన్నతాధికారులు తప్పు చేస్తే ఏ నాయకుడు కాపాడరన్న నగ్న సత్యాన్ని గుర్తించాలని బలి పశువులు కావద్దని నవీన్ విజ్ఞప్తి చేశారు!
నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్