ప్రెస్ నోట్

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ శాఖకు 22 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారని, 26 జిల్లాలలో 99 శాఖలు ఉన్నాయన్నారు .ప్రతి జిల్లాలో ఐఎంఏ కనీసం నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న అక్కడ ప్రజల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని ,ఆరోగ్య పరిరక్షణలో మా సభ్యులు ప్రభుత్వానికి చేయూతనిస్తారన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని ,గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు క్యాన్సర్ ,రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నిరోధముకు ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామన్నారు .అలాగే మన దేశంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎం.ఆర్ )ప్రమాదం పొంచి ఉందని, దీనివల్ల రాబోయే రోజుల్లో అంటు వ్యాధుల నుండి ప్రజల్ని రక్షించటం కష్టమవుతుందన్నారు. విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడటమే అందుకు కారణం అన్నారు. మోతాదు ప్రకారం మందులు వాడకపోతే యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్ కు దారితీస్తుందన్నారు. ఇప్పటికే ఈ రెసిస్టెన్స్ కారణంగా క్షయ వ్యాధిని నిర్మూలించలేకపోతున్నామన్నారు .రాష్ట్రంలోని ఫార్మసీలలో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, అసిస్టెంట్లను ఏఎంఆర్ పై శాస్త్రి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం నుండి కూడా కొన్ని విషయాలలో వైద్యులకు సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా విద్యుత్తు చార్జీలు కమర్షియల్ గా వేయడం, బిల్డింగ్ ఆస్తిపన్నులలో, మందులపై, వైద్య పరికరాలపై జి.ఎస్. స్టీ తగ్గించటం ద్వారా వైద్యాన్ని భారం కాకుండా చూడాలన్నారు. వైద్యులు అన్ని వ్యాధులను, యాక్సిడెంట్లో రోగులను అన్ని సందర్భాల్లో బతికించడం సాధ్యం కాదని ,అప్పటికే శరీర అవయవాలు దెబ్బతిని ఉంటాయని ,అలాంటి రోగులను ప్రతి వైద్యుడు బ్రతికించడం కోసమే తీవ్ర ప్రయత్నం చేస్తాడని, అప్పుడు ఖర్చు పెరగడం సహజమని, అలాంటి సందర్భాలలో రోగి మరణించినప్పుడు రోగి బంధువులు వైద్యులపై, వైద్యశాలలపై దాడులు చేయడం తగదన్నారు .ఆ దాడులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఒక చట్టం తీసుకు వచ్చిందని ,ఆ చట్టంలో ప్రస్తుతం మరికొన్ని మార్పులు చేసి కఠినంగా అమలు చేయడం ద్వారా వైద్యులపై దాడులను అరికట్టాలన్నారు. విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ దగ్గు మాటి శ్రీహరిరావు మాట్లాడుతూ వైద్యులకు సింగిల్ విండో విధానం ఉండాలని… వేస్టే మేనేజ్మెంట్ ద్వారా హాస్పిటల్ లో ఉన్న బెడ్స్ కి అన్నింటికీ కాకుండా సరాసరి ని అలాగే బరువు నీ బట్టి గానీ ఛార్జ్ చేయాలని ,15 మీటర్లు కన్న తక్కువ ఉన్న ఆసుపత్రులకు ఫైర్ noc లేకుండా రెన్యూవల్ చేయాలని కోరారు.. ఐ ఎం ఎ అధ్యక్షులు డాక్టర్ టి జనార్ధన్ నూతన అధ్యక్షులు డాక్టరు ఎ ఆర్ రెడ్డి, ఐ ఎం ఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి. సేవ కుమార్.. నూతన కార్యదర్శి డాక్టరు ఎం… శ్యామ్ బాబు.. కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప్ పాల్గొన్నారు.