తిరుపతి ఆధ్యాత్మిక నగరం “బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రంగా” కేర్ అఫ్ అడ్రెస్స్ గా మార్చడం దురదృష్టకరమ ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సనివారం అయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు.

భారతదేశంలో అపారమైన ప్రతిభ ఉంటే కానీ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాలేరు అటువంటి వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి సమాజంలో గౌరవాన్ని,మీ జీవితాన్ని కలుషితం చేసుకుని పౌర సమాజం “చీ”కొట్టేలా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా ఎందుకు తయారవుతున్నారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు!

తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని 34 వేల EPIC (బోగస్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్) కార్డులను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు తయారు చేశారని సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం సాక్షాదారాలతో సహా ఐఏఎస్,నగరపాలక సంస్థ,రెవిన్యూ అధికారులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు!

తిరుపతిలో ఇటీవల జరిగిన పార్లమెంట్,ఎమ్మెల్సీ,నగరపాలక సంస్థ ఎన్నికలతో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జరిగిన ఓటర్ల జాబితా చేర్పులు,మార్పులలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగం,నగరపాలక సంస్థ సంయుక్తంగా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా చనిపోయిన వారి స్థానంలో బతికున్న వారి ఫోటోలను చేర్చడం అలాగే ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు!

తిరుపతి,చంద్రగిరి,కాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్ రూరల్ మండలాలలో సుదీర్ఘకాలంగా తిష్ట వేసి పనిచేసిన రెవెన్యూ అధికారులను సైతం కేంద్ర ఎన్నికల సంఘం “కేంద్ర నిఘా సంస్థ” ల ద్వారా విచారణకు ఆదేశిస్తే వారి అక్రమ ఆస్తులతో పాటు నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు!

తిరుపతి కేంద్రంగా 34 వేల బోగస్ ఫోటో ఓట్ల తయారీ కోసం…
A) ఏ ఫోటో స్టూడియోలో భోగస్ వ్యక్తుల ఫోటోలు తీశారు?
B) ఏ జిరాక్స్ సెంటర్ లో 34 వేల భోగస్ ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేశారు?
C) తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం కేంద్రంగా నగరంలో ఎక్కడెక్కడ ప్రైవేటు కార్యాలయాలు ఓపెన్ చేసి బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రాలు ప్రారంభించారు?…అన్నదానిపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాలన్నారు!

తిరుపతి నగరపాలక సంస్థలోని మరి కొంతమంది ఉన్నతాధికారులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు బోగస్ ఓటర్ కార్డుల తయారీలో భాగస్వాములయ్యారా? “ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేరంటారు”అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు!

రాజకీయ పార్టీల,నాయకుల మాటలు నమ్మి కొంత మంది అధికారులు
“బలి పశువులు” అవుతున్నారని,ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలు వీదుల పాలవుతున్నా అక్రమంగా లబ్ధి పొందిన ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ సస్పెండ్ కు గురైన వారి వైపు కన్నెత్తి చూడడం లేదని,కనీసం ఫోన్లల్లో కూడా అందుబాటులోకి రాకపోవడం ఇతర ఉద్యోగస్తులు గమనించాలన్నారు!

రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఉద్యోగస్తులు వాలంటీర్లు స్వార్థ రాజకీయ పార్టీల,నాయకుల స్వప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేలా తప్పు చేసే ముందు తమ కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలన్నారు!

తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 34 వేల బోగస్ ఎపిక్ కార్డుల తయారీ కారణంగా ఉన్నతాధికారులు,ఉద్యోగస్తులు, కిందిస్థాయి సిబ్బంది సస్పెండ్ అవడంపై “పౌర సమాజం” స్పందించాలని “తిరుపతి కే మాయని మచ్చ” అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు!