ప్రముఖ కవి గుర్రం జాషువ 128 వ జయంతిని శుక్రవారం ఒంగోలు లో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువ సాహిత్య సాంస్కృతిక సేవ సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిలా కల్లెక్టరేట్ ప్రకాశం భవన్ లో జాషువా కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు, పులువురు ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారుల చేతుల మీదుగా ఆవిష్కరిచారు. ఈ సందర్భంగా జాషువ సాహిత్య జయభేరి మహా సభను నిర్వహించారు. జాషువ సాహిత్య పురస్కారాలను ఐదుగురు ప్రముఖులకు అందజేశారు. శ్రీరామ కవచం సాగర్, డా.నూకతోటి రవికుమార్, డా.బద్దిపూడి జయరావు, దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, సింహాద్రి జ్యోతిర్మయి లను ఘనంగా సత్కరించారు.