జనసేనకు 6.3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు పార్టీకి ఉన్నారు. మొత్తం 226 మంది మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.10.3 కోట్ల బీమా సాయం అందించాం. 320 మందికి మెడికల్ రీ ఎంబర్స్మెంట్ సొమ్ము రూ.2 కోట్ల వరకు అందించాం. పార్టీ కోసం ఎంతో కష్టపడి అనుకోని ప్రమాదంలో మృతి చెందుతున్న క్రియాశీలక సభ్యుల కుటుంబాలను ప్రత్యక్షంగా వెళ్లి పరామర్శించి వారికి ఆపద కాలంలో అండగా నిలవడం వారికి కొండంత భరోసా నింపుతోంది. పార్టీలో సభ్యులను కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరికీ బీమా ఉండాలనే ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు గొప్పది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.