VYOOHAM team ..Left to right is Rajashekar the lyricist ,Siva the P R O , Dasari Kiran kumar the producer RGV, the Director, Narendra from Jaya media and Keertana Sesh the music director

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రం తేదీని అయన తాజా గా ప్రకటించారు. ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేసారు. రాజకీయ నేపద్యం సినిమా అయిన వ్యూహం సినిమా పై తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ హైకోర్ట్ ను ఆశ్రయించడం తో ఈ సినిమా విడుదల ఆగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 29 న విదుల చేయాలనీ అనుకున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 23 న విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. హైకోర్ట్ అదేదల మేరకు వ్యూహం సినిమా మరోమారు సెన్సార్ చేసారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.