డిల్లి : మాజీ ఉపప్రధాని, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అడ్వాణి కి కేంద్ర ప్రభుత్వం భారత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను 2024 ఫిబ్రవరి 3న ప్రకటించింది.
1927 నవంబర్ 8 న ప్రాంతంలోని కరాచీ పట్టణం లోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ళ వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు.

1967 లో మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా పనిచేసారు. 1977 లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందారు. 1980 లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించారు.

2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా.. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేదు. పాకిస్తాన్ మొదటి అద్యక్షుడు మహమ్మాద్ అలీ జిన్నా ను ప్రాజాస్వామ్య వాది , సెక్యులర్ అని అడ్వాణి వ్యాఖ్యానించిన నేపధ్యంలో ఆయనకు ఆ తరు వాత పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిన సంగతి తెలిసిందే.