ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి మహాధర్నా చేయడం జరిగింది. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు కానీ విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు, రైల్వే జోన్ అన్నారు, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా ఏపీకి తీరని ద్రోహం చేస్తుంటే అటు టీడీపీ ఇటు వైసీపీ మాత్రం బీజేపీకి గులాంగిరి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ద్రోహం చేస్తున్నారు. కచ్చితంగా ఈ విషయంలో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి –
ఎపిసిసి ప్రెసిడెంట్ వై .ఎస్. షర్మిల , ఢిల్లీ