తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చేయాలని, రాజధాని నగరానికి కావలసిన అన్నీ అర్హతలు, వసతులు తిరుపతికి వున్నాయని, కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు నచ్చిన, మెచ్చిన, ఆమోదయోగ్యమైన నగరం మన తిరుపతి అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు . తిరుపతి మన రాజధాని అనే బ్యానేర్ తో అయన గురువారం తిరుపతి నగరంలో ప్రచారం చేసారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రము విడిపోయిన తర్వాత తిరుపతిని రాజధానిని చేయాలని తాను ఆనాడే కోరన్నని గుర్తు చేసారు. గడచిన ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటూ లేకుండా పోయిందని, అమరావతి, విశాఖపట్నం కంటే తిరుపతి నగరం రాజధానిగా అన్ని విధాలా బాగుంటుందని, దీన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ” 1953 లోనే ఎన్.జి. రంగా గారు తిరుపతి రాజధాని చేయాలని ప్రతిపదిచారని, అయితే నీలం సంజీవరెడ్డి తన రాజకీయ పలుకుబడితో, పరపతిని ఉపయోగించి కర్నూలును రాజధానిగా చేశారు. ప్రత్యామ్నాయంగా తిరుపతి కి ఎస్వీ యూనివర్సిటీ ఇచ్చారు ఆనాడు.
1956 లో ఆంధ్ర, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ రాజధాని నగరం అయింది.” అని అయన తెలిపారు.
2014 లో రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి కి రావాల్సిన రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారాని విమర్శించారు. “తిరుపతి వాసి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు రాజధాని రాకుండా, తుళ్ళూరుకు తీసుకెళ్లాడు. బాబును ఆనాడే హెచ్చరించాను. అయినా చంద్రబాబు నా మాట వినలేదు.” అని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని నగరం విశాఖ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని నగరం లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి లకు దక్కిందని విమర్శించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి తన కాల జ్ణానం లో.. తిరుపతి మహా నగరం, ముఖ్య పట్టణం అవుతుందని రాశారు.
వెంకటగిరి – రావూరు మధ్య ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నవి. అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్, 7 జాతీయ రహదారులు, మంచి అనుకూలమైన వాతావరణం, 7 విశ్వ విద్యాలయాలు, కండలేరు – సోమశిల నుంచి తాగునీటి వసతి, దుగరాజపట్నం ఓడరేవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తిరుపతిలో ఉన్నవి. అన్ని విధాలా రాష్ట్ర రాజధానికి తిరుపతి నగరం చాలా అనువైనది అని అయన వివరించారు. తిరుపతిని రాజధానిని చేసే అంశంపై ఇప్పటికైనా నాటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నటి ప్రతిపక్షనేత , నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇద్దరూ కోడా గతంలో చేసిన తప్పిదాల్ని సరిదిద్దుకునే దిశగా తిరుపతిని రాజధానిని చేయడానికిముందుకు రావాలని చింతా మోహన్ సూచించారు.