అభ్యుదయ వేదిక, అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో బుధవారం లెనిన్ శత వర్థంతి సదస్సును నిర్వహించారు.ఈ సదస్సులో అభ్యుదయ వేదిక జిల్లా కార్యదర్శి ఎండి ప్రసాద్ అధ్యక్షతన సామ్రాజ్యవాదం – లెనినిజం ప్రాసంగికత అనే అంశంపై సెమినార్ లో వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ పాల్గొని మాట్లాడారు.విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి హరినాథ్ రెడ్డి, అభ్యుదయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం వెంకట రమణ , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ తిరుపతి నగర ప్రముఖులు , విద్యార్ధిని, విద్యార్థులు , యువజన తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .
” సామ్రాజ్యవాదాన్ని కూల్చడం అనేది ప్రజల ముందు వున్న కర్తవ్యం”
( లోక్ పెన్ – తిరుపతి )
” సామ్రాజ్యవాదం వివిధ రూపాల్లో.. పెట్టుబడి రూపంలో శాసిస్తుంది.. అంతర్జాతీయ పెట్టుబడి అది స్వతంత్ర దేశాల్ని, సార్వభౌమాధికార దేశాల్ని శాసిస్తోంది. ఇవాళ విదేశి పెట్టుబడుల రూపంలో మారు మూల వున్న కంపెనీల్ని కూడా అంతర్జాతీయ పెట్టుబడి మన దేశాలన్ని, ప్రపంచం లోని ఇతర దేశాల్ని శాసిస్తోంది.
ఇవాళ మనము చూస్తె షేర్ మార్కెట్ ను విదేశీ పెట్టుబడులే శాసిస్తున్నాయి. అంటే.. లెనిన్ చెప్పిన దానికన్నా ఇవాళ సామ్రాజ్యవాదం మన జీవితాల్ని మరింత కబళించే శక్తిగా తయారయ్యింది.
లెనిన్ పుస్తకాల్లో అనేమంది అనేక మైన విషయాల్ని చెప్పినారు.
లెనిన్ జీవితం, లెనిన్ పోరాటం, లెనిన్ ఎగురవేసిన విప్లవ పతాకం, అయన జీవితం పై వచ్చిన పుస్తకాలు, ఆయన చెప్పిన నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట కార్యాచరణ ఇవన్నీ కూడా ఆచర ణీయమైనవి.అందులో ప్రధానమైనది రాజకీయ కార్యాచరణ. లెనిన్ దీనిని చాలా స్పష్టంగా చెప్పారు. లెనిన్ పోరాటం, అయన జీవితం, అయన సందేశం ఇప్పటికీ మనకు దిక్సూచిగా నిలుస్తూ వుంది.
ఇవన్నీ ఈ సదస్సుల ద్వారా చెప్పడం ఎందుకు? వివరించడం ఎందుకు? అంటే.. సామ్రాజ్యవాదాన్ని కూల్చడం కోసం. సామ్రాజ్యవాదాన్ని కూల్చడం కోసం.
సామ్రాజ్యవాదాన్ని కూల్చడం అనేది ప్రపంచ ప్రజల ముందు వున్న కర్తవ్యం. భవిషత్తు విద్యార్థి యువజనులదే. వారిపై మరింత ఎక్కువ బాధ్యత వుంది.
సామ్రాజ్య వాదాన్ని కూల్చకపోతే యుద్దం ఆగదు.
సామ్రాజ్య వాదాన్ని కూల్చకపోతే జీవన విధ్వంసం ఆగదు.
సామ్రాజ్య వాదాన్ని కూల్చకపోతే ధరల పెరుగుదల నుంచి జీవిత భద్రత వరకూ అనేక అంశాలలో మార్పు రాదు.
లెనిన్ చెప్పింది సామ్రాజ్యవాదాన్ని కూల్చడం గురించి. దోపిడి లేని మానవీయ సమాజాన్నీ నెలకొల్పడం గురించి చెప్పారు. ఇవాళ సామ్రాజ్యవాదాన్ని మరింత ఎక్కువగా దాన్ని కూల్చ వలసిన అవసరం వుంది.
లెనిన్ శత జయంతి.. ఇవాళ లెనిన్ ని యెట్లా చూస్తాం? లెనిన్ ఎక్కడి నుంచి వస్తాడు?ఆరోజు లెనిన్ లాంటివాడు , లెనిన్ లాంటి ఒక్కడు రష్యాలో మార్పు తెచ్చాడు, విప్లవ పతాకాన్ని ఎగుర వేసాడు.
కానీ ఇవాల మన దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా వందలాది లెనిన్ ల అవరం వుంది.
కావున లెనిన్ శత జయంతి అనేది లెనిన్ గురించి మాట్లాడుకోవడానికో, మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడానికో కాదు, అయన చూపిన బాటలో కర్తవ్య దీక్షతో ముందుకు సాగడానికి లెనిన్ ను స్మరించు కుంటున్నాం. సామ్రాజ్యవాదాన్ని కూల్చడం అనేది ప్రపంచ ప్రజల ముందు వున్నా కర్తవ్యం. ఈ బాధ్యత విద్యార్థులపై , యువజనులపై ఎక్కువగా వున్నది.
మన దేశంలో సామ్రాజ్యవాదం, కార్పోటీకరణ, ప్రైవేటీకరణ, మత తత్వం, కారణంగా దేశం కునారిల్లుతున్న సందర్భంలో , లెనిన్ ను స్ఫూర్తిగా తీసుకుంటే, లెనిన్ ను ప్రేరణగా తీసుకుంటే , లెనిన్ రాసినా అనేక రచనలని ఆయా సందర్భాలలో యెట్లా తెసుకోవాలి అని చెప్పాడో .. ఆ దిశగా పోరాడాలి. లెనిన్ తన కాలంలో ఏపని చేసాడు..ఎలా పోరాడారు అనే అంశాలను అయన పోరాట జీవితం నుంచి, అయన పుస్తకాల నుంచి ప్రేరణగా, స్పూర్తిగా తీసుకుని..ఆ దిశగా లెనిన్ ను ప్రేమించేవాళ్ళు, దేశాన్ని ప్రేమిచేవాళ్ళు , దోపిడీ లేని సమాజం కావాలని కాంక్షించే వాళ్ళు..కార్యచారణ దిశగా, రాజకేయ కార్యాచరణ దిశగా పయనించాలి .
భవిస్యత్తు అంతా విద్యార్థి, యువజనులదే ,లెనిన్ పుస్తకాలు చదవండి. అందులోని అంశాల్ని ఆచరించండి.మన భారత దేశంలో దోపిడీ లేని సాంఘిక ధర్మాన్ని నెలకొల్పే బాధ్యత కూడా విద్యార్తి, యువజనులదే. నాకు ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన వారికి, ఓపికగా విన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
*వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం మాసపత్రిక.