ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ ద్వితీయ వర్ధంతి- స్మారక సాహిత్య సభలో గంగవరపు సునీత
మరో గబ్బిలాని త్వరలోనే మీ ముందుకు తెస్తాను
గుర్రం జాషువా, ఎండ్లూరి సుధాకర్ వంటి మహనీయుల ఆశయాల్ని
ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యం
ఎండ్లూరి సుధాకర్ ద్వితీయ వర్ధంతి- సంస్మరణ సభలో ప్రముఖ కవి గంగవరపు సునీత
( లోక్ పెన్ – ఒంగోలు )
ప్రముఖ కవి , రచయిత ఎండ్లూరి సుధాకర్ రెండో వర్ధంతిని పురస్కరించుకుని స్మారక సాహిత్య సభ జనవరి ౨౮ ఆదివారం సాయంత్రం ఒంగోలు శ్రినగర కాలనీ లోని మల్లవరపు రాజేశ్వర రావు విజ్ఞాన కేంద్రములో జనుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షతన నిర్వ హించారు. ముఖ్య అతిధులు సునీత గంగవరపు, డా. బద్ది పూడి జయరావు, నాతాని హనుమంత రావు, గంగవరపు విజయరావు, ఎజ్రా శాస్త్రి డాక్టర్ నూకతోటి రవికుమార్ తదితరులు ప్రసంగించారు .
కవి సునీత గంగవరపు ప్రసంగం ..ఆమె మాటల్లో..
” ఎండ్లూరి సుధాకర్ సార్ మాటల్లో కవిత్వం వుంటుంది. అయన కవిత్వంలో ప్రాణం వుంటుంది. మానవీయత వుంటుంది. అనేక మందిని ఉత్తేజితుల్ని చేస్తుంది. ఆలోచింపజేస్తుంది. మళ్ళీ మళ్ళీ చదవడానికి ఉసిగొల్పుతుంది. అటువంటి కమ్మనైన కవిత్వాన్ని వండి వడ్డించారు.
మనం, పాఠకులు , అయన అభిమానులు ఆస్వాదిస్తూ చప్పరిస్తున్న సమయంలో , అయన సడన్ గా లేచి వెళ్లి పోయినట్లుగా.. అర్దాంతరంగా..మనకు దూరం అయిపోయినటువంటి కవి, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ గారి ద్వితీయ సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి.. పేరు పేరునా వందనాలు.
కావ్యత్రయంలో అయన ముందుమాటలో చెబుతారు. నువ్వు ఎంత కష్టపడ్డావో..ఏమి చేసావో ..అది పాఠకునికి అనవసరం. నువ్వు ఏమి రాసావు? ఏమి చెబుతున్నావు? అనేది ప్రధానం అని చెప్పారు. ఇన్ని కావ్యాలు, కవిత్వం రాసారు అంటే అది ఆషామాషీ అయ్యేపనికాదు.
ఆయన రాసిన భాషా నైపుణ్యాలు, వక్రోక్తి పద ఒరయోగ వైచిత్రి విశేషాలు, సంఘటనత్మక అంశాలు, ఇవన్నీ కూడా అయనని ఒక కవిగా ఒక అగ్రస్థానంలో నిలబెట్టాయి. నేను వాస్తవంగా దళిత సాహిత్యం గురించి చెప్పలనుకున్నాను. జయరావు సార్ మాట్లాడాక , నాకు సుధాకర్ సార చెప్పిన అనేక విషయాలు గుర్తోచాయి.. పిల్ల గురించి, అయన గురించి.
నాకు ఆయన పరిచయం కాక ముందు, నేను రాసిన కవిత్వం ఎక్కువభాగం స్త్రీవాద సాహిత్యం.
నేను చూసిన సమాజం, చుట్టూవున్న పరిస్తితుల నుంచి , పురుషాధిక్యత సమాజం ఇవన్నీ కారణం కావొచ్చ్చ. పురుషుల మీద ఒక నిరసన భావం వుండేది. అటువంటి సమయంలో నా మొదటి పుస్తకము ‘ఇట్లు ఓ ఆడపిల్ల’.. ఒక స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆడపిల్లలను చిన్నచూపు చూడటం , లింగ వివక్ష, ఇవి ఎక్కువగా వుంటాయి. అటువంటి సమయంలో ముందుమాట ఎవరితోటి రాయించాలి అని అనుకున్నపుడు నీకు నూకతోటి రవికుమారన్న గుర్తొచ్చాడు. అన్న చెప్పారు..సుధాకర్ సార్ని పరిచయం చేసింది అన్నే. సుధాకర్ సార్ నెంబర్ ఇచ్చారు. అపుడు మొదటి సారి సా ర్కు ఫోన్ చేసాను.
అంత పెద్ద కవితో మాట్లాడటానికి భయం వేసింది. సార్ మీకవితలు బాగుంటాయి సార్ అన్నాను. ఎవరమ్మా నువ్వు అన్నారు. నేను ఫలానా అని చెప్పాను. సార్ నేను ఒక పుస్తకం రాసాను. మీ ముందుమాట కావాలి అన్నాను. సరే పుస్తకం పంపిచ్చు మ్మా అన్నారు. నేను పంపాను. పెద్దవాళ్ళు వాళ్ళు కదా బిజీగా వుంటారు కాబట్టి , ముందుమాట కోసం రెండుసార్లు ఫోన్ చేశాను. సార్ పంపిచ్చారు. తర్వాత ఆ పుస్తకం వచ్చింది. ఇట్లు ఓ ఆడపిల్ల నా తొలి పుస్తకం త్రిపురాతకంలో ఆవిష్కరణ జరిగింది.
నాకు ఎండ్లూరి సుజాత అనే ఫ్రెండ్ వుండేది, తాను సుధాకర్ సార్ తో మాట్లాడాలి అంటే, నేను ఫోనేచేసి సార్ తో మాట్లాడించాను. అపుడు సార్ నాతో అన్నారు “ఏమమ్మా ముందుమాట రాసిన వాళ్ళకు పుస్తకం పంపడం కూడా తెలీదా ” అని అడిగారు. ఆ తర్వాత నేను పుస్తకం పంపాను.
నేను మా ర్టూరుకు బదిలీ అయ్యాను తెలుగు పండిట్ గా. నేను రాసిన తోలి సంకలనం నాకే నచ్చలేదు. అపుడపుడే రాస్తూ వున్నాను. అప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదవడం ప్రారంభించాను. కవితలు రాస్తూ 2017 లో ఒకసారి నేను రాసినా కవిత పంపాను. అపుడే నేను కూడా స్మార్ట్ ఫోన్ కొన్నాను . ఆ కవిత చదివి బాగా రాస్తున్నావ్ అని అభినందించారు. ఆ తర్వాత నేను ఎపుడు కవిత రాసినా ఆయనకు పంపిచడం జరుగుతుండేది.
అలా పరిచయం అయ్యాక , నా రెండో పుస్తకం వెన్నెల చివుళ్ళ కు ముందుమాట సార్ రాసాడు. ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలి అని సుధాకర్ సార్ కు ఫోన్ చేసి ఆహ్వానించాను. వీలుంటే వస్తానని చెప్పారు. అనుకున్నట్లే వచ్చారు. ఇక్క్కడే ఒంగోలులోనే వెన్నెల చివుళ్ళు పుస్తక ఆవిష్కరణ జరిగింది. సార రావడం వల్ల విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత నాకు తెలుగు భాషకు సంబంధించి ఏ సందేహాలు వున్నా ఫోన్ చేసేదాన్ని. సార్ ఇబ్బంది పెడుతున్నానామిమ్మల్ని అంటే , అదేమీ లేదు సునీత చెప్పు సునీత అని నా సందేహాలను తీర్చేవాడు. పిల్లల పట్ల, , భార్య పట్ల ఎంతో ప్రేమ ఆయనకు. అపుడపుడూ వారి గురించి చెబుతుండేవారు.
అంత పెద్ద హోదాలో వున్నా, రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు బదిలీ అయినపుడు ఒక చిన్న గదిలో వుండేవారు. నేలపైన పడుకునే వారు. గొప్పకవి మన నుంచి దూరం కావడం బాధాకరం. అందరూ పోవాల్సిన వాళ్ళే కానీ, అయన ఇంకా నా లాంటి ఎంతో మందికి స్పూర్తి నిచ్చి,. ఎందుకంటె ఇంకా అయన చెప్పల్సినది ఎంతో వుంది ఈ సమాజానికి. ఆయనలాగా రాయలేము. అయన ఒక మార్గ దర్శకుడిగా, ఒక గురువుగా, పలువురికి అయన ముందు చూపై, చూపుడు వేలై .. నిలాబడ్డారు. అలాంటి గొప్ప మనిషి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం.
అయన ఎన్నో రాసారు. కొత్త గబ్బిలం, వర్గీకరణం,గోసంగి కావ్యత్రయం రాసారు. ఆయన హైదరాబాద్ లో ఒరిన్తల్ కాలేజీలో చదివేప్పుడే కవి కాళిదాసు రాసిన రఘు వంశము, మేఘసందేశం, కుమార సంభవం .. చదివారు. వాటిని కాళిదాసు త్రయం అని అంటారు. అప్పట్లోనే నేను కూడా ఎప్పటికైనా మూడు పుస్తకాలూ రాసి సుధాకర త్రయం అని పెట్టుకోవాలి అనుకున్నారట. అనుకున్నట్లే అయన కొత్త గబ్బిలం, వర్గీకరణం, గోసంగి కావ్యత్రయం రాసారు.
అగ్రవర్ణాల వారు రాసిన వాటిల్లో నాయికా అంద చందాలు వుంటాయి అని ఎవరో అంటే, అందుకు బదులుగా ఓ నా ఛండాళిక..అనే కవితలో దళిత స్తీల శ్రమలో, వారి నల్ల ధనములో కూడా అంద చందాలు వున్నాయి అని చాలా గొప్పగా వర్ణిస్తూ రాసారు.
ఎండ్లూరి సుధాకర్ సార్, హేమలత మేడం అనేకసార్లు చెప్పేవారు. మన వాళ్ళు ఎంతో వెనుకబడి వున్నారు. అజ్ఞానం తో వున్నారు. పేదరికం తో వున్నారు అని చెప్పేవారు. మన వాళ్ళు బాగా చదువుకోవాలి. ఇంటింటికి ఒక పీహెచ్ డి రావాలి అని కోరుకునేవారు. అయన ఖరీదైన దుస్తులు కూడా వేసుకునేవారు కాదు. దళితులు చాలా మంది ఇంకా ఒక చోకా కూడా వేసుకోలేని వాళ్ళు వున్నారు అని చెప్పేవారు.
దళితుల్లో వున్నా అన్ని ఉప కులాలకు కూడా రిజర్వేషన్లు వుండాలి అని అయన చాలా గట్టిగా వర్గీకరణము లో చెప్పారు. ఇక గుర్రం జాషువా గురించి ఎడ్లురి సుధాకర్ గారు నిర్వహించిన సభలు, చేసినన్ని ప్రసంగాలు వేరెవ్వరూ చేయలేదు. అయన మరో గబ్బిలం రాయడానికి జాషువా గారి గబ్బిలం, సాహిత్యమే స్పూర్తి మరనించిన వారిని స్మరించుకోవడం , వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళడం మనందరి కర్తవ్యం. అయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో భాగంగా నేను మరో గబ్బిలం అనే పుస్తకాన్ని తీసుకు వస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణ చేస్తున్నాను. మరో గబ్బిలానికి రెక్కలు కూడా తొడిగాను. పేరు పెట్టాను . దాని పేరే మరో గబ్బిలం. త్వరలోనే దాన్ని తీసుకు వస్తాను . నాకు ఈ అవకాశసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
– సునీత గంగవరపు
**********************
మట్టి మూలాల్నించి..మానవ జాతి సమూహ బాధల నుంచి “ఎండ్లూరి” సాహిత్యం
ఎండ్లూరి సుధాకర్ సార్ కు కూతురు మానస అంటే చాలా ఇష్టం. చిన్నపుడు మీసాలు గుచ్చుకున్నయంటే అవి తీసేసాడు. డాడీ కంపు కంపు అంటే ..సిగరెట్లు మానేసాడు. కూతురు ఎదిగిన తర్వాత తండ్రిని కూడా ఒక పురుషునిగా చూస్తుంది అని చెబుతూ , సుధాకర్ సార్ ఒక అద్భుతమైన కవిత రాసాడు. తండ్రితో ఒక బొమ్మ తో ఆడుకున్నట్లు ఆడుకునే బిడ్డ ఎదిగిన తర్వాత చాలా సహజంగా పాటించే దూరాన్ని , ఆ ఎడబాటును అ కవితలో “తండ్రి కూడా ఒక తల్లే అని దానికి చెప్పందయ్యా ” అని సుధాకర సార్ ఆ కవితలో ఒక తండ్రి హృదయ స్పందనని అద్బుతంగా ఆవిష్కరించారు.
మయసభ అని రాసిన ఆత్మ కథ లో మాల మాదిగలను అగ్ర వర్ణాల వారు, ఎలా పిలుస్తారు అనే విషయాల్ని తన కవిత్వం ద్వారా చెప్పారు. నాలుగు లైన్లు చదివి వినిపిస్తాను. ” మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది. బహిరంగావేదిక మీద నా సన్మానం మొదలైంది. ఇపుడు నా మెడలో దండలు పడుతుంటే, నిన్నటి గాయాలు ఉలిక్కిపడుతుంటాయి . అద్భుతమైన పోయెట్.
మూలాల్ని మరచిపోని కవి మాత్రమే రాయగలడు. ఊహలతో రాసే కవిత్వం కాదు ఇది, సరదా కొసమ్ రాసే కవిత్వం కాదు. కడుపునిండిన వారు రాసే కవిత్వం కాదు. మట్టి మూలాల్లోకి వెళ్లి , మానవ జాతి సమూహ బాధల్లోకి వెళ్లి వాళ్ళ జేవితాల్లోకి వెళ్లి వాళ్ళ బ్రతుకుల్లో ఉన్నటువంటి బతుకు అర్థాన్ని రాయగలిగిన కవి మాత్రమే ఇలాంటివి రాయగలడు. ఇంకా గొప్ప గొప్ప గోవిత్వం రాసినా మా గురువుగారు, ఆ కుటుంబంతో మాకు వుండే అనుబంధం విడదీయలేనిది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసున్నాను.
సాహిత్య పరిశోధకుడు డా. బద్దిపూడి జయ రావు