“నేను మొన్న విశాఖ పట్టణానికి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ కు వెళ్ళాను. సెక్యూరిటీ వాళ్ళ తో మాట్లాడాను. కేసులో నిందితుడు శీను తో మాట్లాడాను. శీను అమాయకుడు. ఎస్సీ యువకుడు. జైల్లో వున్నాడు. విమానాశ్రయం లో ఫుల్ సెక్యూరిటీ కంట్రోల్ లో వుంది. ఒక గుండుసూది కూడా లోపలికి వెళ్ళదు.. విమానాశ్రయంలో ఆ కోడికత్తే లేదు. పీక కోసినట్లు చూపించారు. అసలు పెక్కా లేదు. తోకా లేదు. పీక దగ్గర రక్తాన్ని చూపించారు. అసలు రక్తం ఎక్కడినుంచి వచ్చింది? రక్తాన్ని ఎక్కడనుంచి తేచ్చారో నాకైతే తెలీదు. రక్తాన్ని మాత్రం పూసారు చొక్కాకి. ఓయమ్మో పోదిచేసాడు. చంపేసాడు అని సింపతీ కోసం ఇదంతా చేసి, ఒక దళిత యువకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారు. 5 ఏళ్ళుగా బెయిలు రాకుండా చేస్తున్నారు. అసలు సీయం జగన్ ఎందుకు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పడం లేదు ? ఇది జగన్ మోహన్ రెడ్డి దళిత ద్రోహానికి నిదర్సనం. రేపోమాపో అమాయకుడైన శీను ను చంపేసినా అశ్చ్యర్యం లేదు. తప్పు ఇది. ప్రజాస్వామ్య విరుద్దం. చట్ట విరుద్ధం. ప్రజాస్వామ్య విరుద్ధం. నేను డిమాండు చేస్తున్నాను. శీను ను వెంటనే విడుదల చేయాలి. నేను విశాఖ విమానాశ్రయానికి వెళ్లి సంఘటన జరిగినపుడు వున్న సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడాను. కత్తి ఉందా అంటే కత్తి లేదు అని చెప్పారు. రక్తం వచ్చిందా అంటే, రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు. ఏందిమీరు చేస్తుండేది? ఇదా ప్రభుత్వం? ఇదా జగనన్న పాలన ? దుర్మార్గం. ఇటువంటి చర్యలను ఖండిస్తూ , వెంటనే సీనుని విడుదల చేయాలి. క్షమాపణ చెప్పాలి. దీని వెనుక, ఈ రక్తం వెనుక ఒక మంత్రి, పనికిమాలిన మంత్రి వున్నాడు. ఒక అమాయకుడైన యువకుడి ప్రాణాలు కూడా తీసేదానికి ప్రభుత్వం చూస్తోంది. ఏందయ్యా మీరు చేసేది? ఈ విధంగా డ్రామాలు వేస్తారా? అది న్యాయమని అక్కడున్న అధికారులే చెప్పారు. రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు రక్తం? ఎక్కడబోయారు ఈ డాక్టర్లు ? , ఫోరెన్సిక్ రిపోర్ట్లు..ఏమైపోయింది ఈ పోలీసు శాఖ? వోట్లు వేయించుకునే దానికి ఇంత దుర్మార్గానికి దిగుతున్నారా అని నేను జగన్ మోహన్ రెడ్డిని అడుగుతునాను. వెంటనే శీనుని విడుదల చేయాలని అడుగుతున్నాను.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున. ఒక దళితుడే దొరికాడా మీకు? ఏంటయ్యా చేసేది మీరు ? దళితులకు మొత్తం అన్యాయం జారుతోంది ఆంధ్రప్రదేశ్లో” అని తిరుపతి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ భావోద్వేగంతో నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో అయన మీడియా తో మాట్లాడారు.