గూడూరు : కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ కుమార్తె డాక్టర్ చింతా నీనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని డాక్టర్ నీనా భావిస్తున్నారు. అందులో భాగంగా నేడు గూడూరు లో విసృత పర్యటన చేయనున్నారు.మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలి భాగంగా ఇంటింటి పర్యటన కార్యక్రమం ప్రారంభానికి ముందుగా ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.