(Revised)

పత్రికా ప్రకటన తిరుమల, 2024 డిసెంబరు 01

తిరుమలలో జలకళ సంతరించుకున్న జలాశయాలు

తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి.

తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరదనీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 200 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

మధ్యాహ్నం 2 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 694.25 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 4345.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

3) ఆకాశగంగ డ్యామ్ :- 857.85 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 306.50 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

4) కుమారధార డ్యామ్ :- 891.00 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 2372.76 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

5) పసుపుధార డ్యామ్ :- 896.40 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు.

ప్ర‌స్తుత నిల్వ :- 950.39 ల‌క్ష‌ల గ్యాలన్లు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.