పత్రిక ప్రకటన
స్విమ్స్, తిరుపతి
తేది : 30.11.24
స్విమ్స్ కు రూ. 10,00,000/- (రూ. పది లక్షల రూపాయలు) విరాళం
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రికి హైదరాబాద్ నగరానికి చెందిన ఇడిముక్కల హాసిని గారు 10,00,000 /- (పది లక్షల రూపాయల) విరాళాన్ని డి.డి రూపంలో 30.11.2024వ తేది శనివారం ఉదయం 9.30 గం||లకు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారికి అందజేశారు.
ఇడిముక్కల హాసిని గారు మాట్లాడుతూ… మా తాతగారు అయిన కీ. శే. ఇడిముక్కల యతిరాజయ్య గారి జ్ఞాపకార్ధం స్విమ్స్ ఆసుపత్రి కి రూ.10,00,000/- (రూ.పది లక్షల రూపాయలు) విరాళం అందజేశానని తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ఆర్.వి. కుమార్ గారు దాత అయిన హాసిని మరియు వారి కుటుంబ సభ్యులైన శ్రీనివాసరావు, స్రవంతి మరియు వారి స్నేహితులైన రాజేష్ బాబు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, ఇచ్చిన విరాళాన్ని పేద రోగుల వైద్యానికి ఉపయోగిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ డిప్యూటి డైరెక్టర్ (బిల్లింగ్ సెక్షన్) సురేష్ గారు పాల్గొన్నారు.